KTR: ఈ పోలీసుల అమానవవీయ చర్యలను హోంమంత్రి, డీజీపీ దృష్టికి తీసుకెళతా: కేటీఆర్

KTR fires on police behavior towards a father of girl student

  • హైదరాబాద్ లో ఓ ప్రైవేటు కాలేజీలో విద్యార్థిని అనుమానాస్పద మృతి
  • మృతదేహాన్ని తరలిస్తుండగా అడ్డుకున్న విద్యార్థిని తండ్రి
  • కాలితో తన్నిన పోలీసులు
  • తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన కేటీఆర్

హైదరాబాద్ లోని పటాన్ చెరులో ఓ ప్రైవేటు కాలేజీ విద్యార్థిని అనుమానస్పద పరిస్థితుల్లో మృతి చెందింది. అయితే ఆమె మృతదేహాన్ని పోలీసులు హడావుడిగా తరలిస్తుండడంతో, ఆమె తండ్రి పోలీసులను అడ్డుకోగా, ఆ పోలీసులు ఆయనను కాలితో తన్నడం తీవ్ర విమర్శలపాలవుతోంది. దీనికి సంబంధించిన వీడియోను ఓ నెటిజన్ ట్వీట్ చేయగా, మంత్రి కేటీఆర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ పోలీసులు ఇంత ఆటవికంగా ప్రవర్తించిన వైనాన్ని హోంమంత్రి మహమూద్ అలీ, డీజీపీల దృష్టికి తీసుకెళతానని ప్రకటించారు. కష్టకాలంలో బాధితుల పట్ల ప్రభుత్వ అధికారులు సానుభూతి ప్రదర్శించాలని ఎవరైనా ప్రాథమికంగా కోరుకుంటారని ట్వీట్ చేశారు.

KTR
Hyderabad
Patancheru
Private College
Student
Police
Home Minister
TS DGP
  • Error fetching data: Network response was not ok

More Telugu News