RGV: మోదీ, ట్రంప్ సంభాషణపై తనదైన శైలిలో స్క్రిప్ట్ రాసిన రామ్ గోపాల్ వర్మ!

Varma makes parody on Modi and Trump talks

  • భారత పర్యటన ముగించుకుని స్వదేశానికి వెళ్లిపోయిన ట్రంప్
  • మోదీ, ట్రంప్ లపై వర్మ ప్యారడీ
  • డాలర్ తో గుజరాతీలను పోల్చిన వర్మ

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటన ముగిసి స్వదేశానికి తిరిగి వెళ్లారు. ట్రంప్ పర్యటన ఓ ఉత్పాతాన్ని తలపించేలా సాగిందంటే అతిశయోక్తి కాదు. ఆయన రాక, స్వాగత సత్కారాలు, అతిథి మర్యాదలు, సందర్శనలు, సంభాషణలు, చర్చలు, ప్రకటనలు.. ఒకటేమిటి ప్రతిదీ ట్రంప్ కోరుకున్న విధంగా అద్భుతః అనే రీతిలో సాగాయి. అయితే, సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్రంప్, మోదీ సంభాషణపై తనదైన శైలిలో ప్యారడీ సృష్టించారు. ఓ స్క్రిప్ట్ రూపంలో దాన్ని ట్వీట్ చేశారు.

ట్రంప్: మిస్టర్ మోదీ, నన్ను చూసేందుకు 70 లక్షల మంది వస్తారని చెప్పారు. కానీ వచ్చింది లక్ష మందే కదా!

మోదీ: మిస్టర్ ట్రంపీ... మీరిక్కడో విషయం గమనించాలి! ఒక డాలర్ తో 70 రూపాయలు సమానమైతే, ఒక గుజరాతీ 70 మంది అమెరికన్లకు సమానం...!!

మొత్తమ్మీద వర్మ అతిపెద్ద ప్రజాస్వామిక దేశాల పాలకుల సంభాషణను కూడా తన చాతుర్యంతో చమత్కారభరితం చేసేశారు.

RGV
Narendra Modi
Donald Trump
Dollar
Gujarathi
American
  • Loading...

More Telugu News