Tennis: టెన్నిస్ స్టార్ షరపోవా సంచలన నిర్ణయం.. ఆటకు వీడ్కోలు
- ఐదు గ్రాండ్‌స్లామ్‌లు, 2014లో వింబుల్డన్ గెలుచుకున్న మరియా
- వీడ్కోలు ప్రకటిస్తూ తీవ్ర భావోద్వేగం
- టెన్నిస్ తనకు ఎన్నో ఇచ్చిందంటూ కంటతడి
అందచందాలు, అద్వితీయమైన ఆటతీరుతో ప్రేక్షకులను తనవైపు తిప్పుకున్న 32 ఏళ్ల మరియా షరపోవా ఆటకు వీడ్కోలు ప్రకటించింది. గ్రాండ్‌స్లామ్ టైటిళ్లను ఐదుసార్లు సొంతం చేసుకున్న ఈ రష్యన్ ముద్దుగుమ్మ టెన్నిస్‌కు వీడ్కోలు ప్రకటిస్తూ తీవ్ర భావోద్వేగానికి గురైంది. మనకు తెలిసిన ఒకే జీవితాన్ని ఎలా వదులుకోవాలి? అని చెమర్చిన కళ్లతో పేర్కొన్న షరపోవా.. చిన్నప్పటి నుంచి ఆడుతున్న టెన్నిస్ కోర్టుకు దూరంగా ఎలా వెళ్లగమని ప్రశ్నించింది.
టెన్నిస్ తనకు ఎన్నో మరపురాని అనుభూతులు, చెప్పుకోలేని దుఃఖాలు ఇచ్చిందని పేర్కొంది. 28 ఏళ్లపాటు తనతో నడిచిన ఈ ఆట తనకో కుటుంబాన్ని ఇచ్చిందంటూ భావోద్వేగానికి గురైంది. ఇది చాలా బాధాకరమని పేర్కొన్న షరపోవా.. ఇక గుడ్‌బై అని చెప్పింది. 2014లో వింబుల్డన్ గెలుచున్న మరియా.. తీవ్రమైన భుజం నొప్పి కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఒకప్పుడు ప్రపంచ నంబర్ వన్‌గా ఖ్యాతికెక్కని షరపోవా 373 ర్యాంకుతో కెరియర్ను ముగించింది.