Rajendranagar: రాజేంద్రనగర్‌లో దారుణం.. నగ్నంగా డ్యాన్స్ చేయాలంటూ మహిళపై దాడి

four youth forced woman to dance nude

  • పుట్టిన రోజు వేడుకల కోసం ఈవెంట్ ఆర్గనైజర్‌ను కలిసిన యువకుడు
  • వేడుకలు ముగిసిన తర్వాత మహిళను కత్తులతో బెదిరించి గదిలో నిర్బంధం
  • రాత్రంతా గదిలోనే భయంగా గడిపిన బాధితురాలు

హైదరాబాద్ శివారులోని రాజేంద్రనగర్‌లో దారుణం జరిగింది. నగ్నంగా నృత్యం చేయాలంటూ ఓ మహిళపై నలుగురు యువకులు దాడిచేశారు. పరారీలో ఉన్న వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈవెంట్ ఆర్గనైజర్ అయిన ఓ మహిళను సంప్రదించిన అమీర్ అనే యువకుడు పుట్టిన రోజు వేడుకలకు సంబంధించి ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ మేరకు ఈ నెల 22న రాత్రి పుట్టిన రోజు వేడుకలు జరిగాయి.

అనంతరం మద్యం తాగిన అమీర్, అతడి మిత్రులు సుల్తాన్, సలీం, రాజ్ అలీలు మహిళ వద్దకు వెళ్లి నగ్నంగా డ్యాన్స్ చేయాలని బలవంతం చేశారు. అందుకామె నిరాకరించడంతో కత్తులు తీసి బెదిరించారు. ఆమెను గదిలోకి తీసుకెళ్లి డ్యాన్స్ చేయాల్సిందేనంటూ దాడిచేశారు. రాత్రంతా గదిలోనే బిక్కుబిక్కుమంటూ గడిపిన బాధితురాలు తర్వాతి రోజు ఉదయం తప్పించుకుని భర్తతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు.

Rajendranagar
Hyderabad
woman
nude dance
Crime News
  • Loading...

More Telugu News