Kapil Mishra: వాళ్లు నన్ను ఉగ్రవాది అంటున్నారు: కపిల్ మిశ్రా

Kapil Mishra comments on critics

  • ఢిల్లీ పోలీసులకు అల్టిమేటం ఇచ్చిన కపిల్ మిశ్రా
  • బుర్హాన్ వనీని టెర్రరిస్టుగా భావించనివారు తనను విమర్శిస్తున్నారని వెల్లడి
  • షర్జీల్ ను విడుదల చేయాలన్న వారు తన అరెస్ట్ కోరుతున్నారంటూ ట్వీట్

సీఏఏ వ్యతిరేకులపై తీవ్రస్వరం వినిపిస్తున్న ఢిల్లీ బీజేపీ నేత కపిల్ మిశ్రా మరోసారి స్పందించారు. ఢిల్లీ ఈశాన్య ప్రాంతంలో నిరసనకారులను మూడ్రోజుల్లోగా తొలగించాలంటూ పోలీసులకు స్పష్టం చేసిన ఈ యువనేత తీవ్ర కలకలం రేపారు. తాజాగా ట్విట్టర్ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

"బుర్హాన్ వనీ, అఫ్జల్ గురులను టెర్రరిస్టులుగా భావించని వారు ఇప్పుడు కపిల్ మిశ్రాను టెర్రరిస్టు అంటున్నారు. యాకూబ్ మెమన్, ఉమర్ ఖాలిద్, షర్జీల్ ఇమామ్ లను విడుదల చేయాలంటూ కోర్టుకు వెళ్లినవారు ఇప్పుడు కపిల్ మిశ్రాను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు... జై శ్రీరామ్" అంటూ హిందీలో ట్వీట్ చేశారు. అంతకుముందు, కపిల్ మిశ్రా పోలీసులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలతో బీజేపీ హైకమాండ్ అప్రమత్తమైంది. ఢిల్లీ బీజేపీ నేతలు సంయమనంతో వ్యవహరించాలని స్పష్టం చేసింది.

Kapil Mishra
CAA
Delhi
Police
  • Loading...

More Telugu News