Narendra Modi: సరోగసీ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం.. జమ్ముూకశ్మీర్‌లో కేంద్ర చట్టాల అమలుకు గ్రీన్ సిగ్నల్
- ప్రధాని అధ్యక్షతన కేబినెట్ సమావేశం
- వివరాలు వెల్లడించిన కేంద్రమంత్రి జవదేకర్
- సరోగసీ బిల్లుకు రాజ్యసభ సెలక్ట్ కమిటీ చేసిన సిపార్సులకు ఆమోదం
జమ్మూకశ్మీర్‌లో ఇక నుంచి కేంద్ర చట్టాలు ఎటువంటి అభ్యంతరాలు లేకుండా అమలు కానున్నాయి. ఈ మేరకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కశ్మీర్‌లో అమలులో ఉన్న ఆర్టికల్ 370ని గతేడాది ఆగస్టులో కేంద్రం రద్దు చేసి రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విడగొట్టింది.
అంతకుముందు వరకు అక్కడ కేంద్ర చట్టాలు అమలు కావాలంటే ఆ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం అవసరమయ్యేది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఆ అవసరం లేకుండా నేరుగా అమలు చేసే సౌలభ్యం కేంద్రానికి లభించింది. ఈ నేపథ్యంలో జమ్మూకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం కింద కేంద్ర చట్టాల అమలుకు ఉత్తర్వులు ఇచ్చేందుకు ప్రధాని అధక్ష్యతన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేవకర్ వెల్లడించారు.
* సరోగసీ క్రమబద్ధీకరణ బిల్లుకు రాజ్యసభ సెలక్ట్ కమిటీ చేసిన సిఫార్సులకు ఆమోదం
* సరోగేట్ మదర్‌గా మారాలనుకున్న మహిళ బంధువే కానక్కర్లేదు
* సరోగసీ బిల్లుకు సంబంధించి మొత్తం 15 సిఫార్సులకు కేబినెట్ ఆమోదం
* ఇటీవలి బడ్జెట్‌లో పేర్కొన్న జాతీయ టెక్నికల్ టెక్స్‌టైల్ మిషన్ ఏర్పాటుకు ఆమోదం