Avanthi Srinivas: చంద్రబాబు పర్యటనను ఉత్తరాంధ్ర ప్రజలు అడ్డుకోవాలి: అవంతి

Avanthi calls to stop Chandrababu on his tour of Visakha and Vijayanagaram districts

  • రేపు విశాఖ, విజయనగరం జిల్లాల్లో చంద్రబాబు పర్యటన
  • అభివృద్ధిని అడ్డుకునేందుకు చంద్రబాబు వస్తున్నాడన్న అవంతి
  • చంద్రబాబును ప్రజాసంఘాలు నిలదీయాలంటూ వ్యాఖ్యలు

మూడు రాజధానుల ప్రకటన తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తొలిసారిగా ఉత్తరాంధ్ర పర్యటనకు వెళుతున్నారు. రేపు ఆయన విశాఖ, విజయనగరం జిల్లాల్లో పర్యటిస్తారు. దీనిపై ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ స్పందించారు. చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటనను ప్రజలు అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నాల్లో భాగంగానే చంద్రబాబు పర్యటనకు వస్తున్నాడని ఆరోపించారు. విశాఖలో అడుగుపెట్టనివ్వకుండా చంద్రబాబును ప్రజాసంఘాలు నిలదీయాలని అన్నారు. ఇది ఉత్తరాంధ్ర ప్రజల ఆత్మగౌరవ సమస్య అని స్పష్టం చేశారు.  చంద్రబాబు మాయలో అమరావతి రైతులు చిక్కుకోవద్దని అవంతి హితవు పలికారు. వైసీపీ నేతల బండారం బయటపెడతానంటూ చంద్రబాబు ప్రగల్బాలు పలుకుతున్నాడని విమర్శించారు.

Avanthi Srinivas
Chandrababu
Visakhapatnam District
Vijayanagaram District
Andhra Pradesh
  • Loading...

More Telugu News