RGV: వర్మలాంటి వ్యక్తి జీవితంలో ఉంటేనా?.. నటి గాయత్రి గుప్తా సంచలన వ్యాఖ్యలు

Gayatri Gupta Shocking Comments On RGV

  • తనకంటే పెద్దవాడు కాకుంటే ఆయననే పెళ్లి చేసుకునేదానిని
  • క్యాస్టింగ్ కౌచ్ ఉందని చెప్పడం వల్లే అవకాశాలు మృగ్యం
  • వర్మతో పనిచేస్తుంటే భలే ఉంటుంది

దర్శకుడు రాంగోపాల్ వర్మపై నటి గాయత్రి గుప్తా సంచలన వ్యాఖ్యలు చేసింది. వర్మ తన కంటే పెద్దవాడు అయిపోయాడని, లేకుంటే ఆయననే పెళ్లి చేసుకుని ఉండేదాన్నని పేర్కొంది. అలాంటి వ్యక్తి జీవితంలో ఉంటే చాలని, ఇంకేమీ అక్కర్లేదంది.

‘ఫిదా’, ‘సీత ఆన్ ది రోడ్’ వంటి సినిమాల్లో నటించి పేరు తెచ్చుకున్న గాయత్రి గుప్తా.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. శ్రీరెడ్డి చెప్పినట్టు ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందని చెప్పడం వల్లే తనకు అవకాశాలు రాకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేసింది. వర్మ తనకు ‘ఐస్‌క్రీం-2’ సినిమాలో అవకాశం ఇచ్చారని గుర్తు చేసిన గాయత్రి.. ఆయనతో పనిచేస్తుంటే మారథాన్‌లో పాల్గొంటున్నట్టే ఉంటుందని చెప్పుకొచ్చింది.

RGV
Gayathri Gupta
Tollywood
  • Loading...

More Telugu News