Botsa Satyanarayana: రాష్ట్రపతి విందుకు జగన్ ను ఆహ్వానించకపోవడంపై బొత్స స్పందన

Botsa reaction on Jagan not invited for Presidents dinner

  • జగన్ మొదటిసారి సీఎం అయ్యారు
  • ఒడిశా, పశ్చిమబెంగాల్ సీఎంలను ఎందుకు ఆహ్వానించలేదు
  • ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ విందు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ విందుకు పలువురు ముఖ్యమంత్రులను రాష్ట్రపతి ఆహ్వానించారు. అయితే, ఏపీ సీఎం జగన్ కు ఆహ్వానం రాకపోవడంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. విశాఖలో మీడియాతో ఆయన మాట్లాడుతూ, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీకి కూడా ఆహ్వానం అందలేదని చెప్పారు. జగన్ మొదటిసారి సీఎం అయ్యారని... మిగిలిన వారు రెండు, మూడు సార్లు ముఖ్యమంత్రులు అయినా వారిని ఎందుకు పిలవలేదని ప్రశ్నించారు. ఈ విషయంపై ప్రతిపక్ష నేతలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు.

Botsa Satyanarayana
Jagan
YSRCP
Ram Nath Kovind
Dinner
Donald Trump
  • Loading...

More Telugu News