Mahesh Babu: మహేశ్ బాబును కలవనున్న ఇంద్రగంటి మోహనకృష్ణ?

Indraganti Mohana Krishna Movie

  • వంశీ పైడిపల్లి స్క్రిప్ట్ లో మార్పులు 
  • రంగంలోకి దిగనున్న పరశురామ్
  • లైన్ చెప్పనున్న ఇంద్రగంటి  

'సరిలేరు నీకెవ్వరు'తో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న మహేశ్ బాబు, ఆ తరువాత చేసే సినిమా అంతకి మించి వసూలు చేసేలా వుండాలని భావించాడు. అయితే వంశీ పైడిపల్లి సిద్ధం చేసిన స్క్రిప్ట్ మహేశ్ బాబుకి ఆ స్థాయి నమ్మకాన్ని కలిగించలేకపోయిందట. దాంతో ఆయనకి మరింత సమయమిచ్చి, పరశురామ్ ను రంగంలోకి దింపుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలోనే ఇంద్రగంటి మోహనకృష్ణ పేరు కూడా తెరపైకి వచ్చింది. విభిన్నమైన కథాకథనాలను తెరపై కొత్తగా ఆవిష్కరించడంలో ఇంద్రగంటి మోహనకృష్ణ సిద్ధహస్తుడు. ఆయన తాజా చిత్రంగా రూపొందిన 'వి' వచ్చేనెల 25వ తేదీన విడుదల కానుంది. ఆయనతో మైత్రీ మూవీ మేకర్స్ వారు ఒక సినిమాను నిర్మించనున్నారు. ఇంద్రగంటి దగ్గరున్న కథతో మహేశ్ బాబును ఒప్పించాలనే ఉద్దేశంతో వాళ్లు వున్నారని అంటున్నారు. ఈ కారణంగానే మహేశ్ బాబు అపాయింట్ మెంట్ అడిగారట. రేపుగానీ .. ఎల్లుండిగాని ఆయనను ఇంద్రగంటి  కలుసుకుని ఒక లైన్ ను వినిపించనున్నట్టు తెలుస్తోంది. ఆ లైన్ మహేశ్ బాబుకి నచ్చుతుందో లేదో చూడాలి మరి.

Mahesh Babu
Parashuram
Indraganti Mohana Krishna Movie
  • Loading...

More Telugu News