Delhi: ఇంటెలిజెన్స్ బ్యూరో ఉద్యోగిని చంపి, శవాన్ని కాలువలో పడేసిన అల్లరిమూక!

Mob kills IB official Ankit Sharma in northeast Delhi

  • ఇంటెలిజెన్స్ బ్యూరోలో డ్రైవర్ గా పని చేస్తున్న అంకిత్ శర్మ
  • విధులు ముగించుకుని వస్తుండగా అల్లరి మూక దాడి
  • శర్మ శరీరంపై బుల్లెట్ గాయాలు

హింసతో అట్టుడుకుతున్న ఢిల్లీలో మరో ఘోర ఘటన వెలుగులోకి వచ్చింది. అంకిత్ శర్మ అనే ఇంటెలిజెన్స్ బ్యూరో ఉద్యోగిని హతమార్చిన దుండగులు... ఆయన శవాన్ని ఓ డ్రైనేజ్ కాలువలో పడేశారు. నగరంలోని చాంద్ బాగ్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రెండేళ్ల క్రితం ఇంటెలిజెన్స్ బ్యూరోలో చేరిన శర్మ... డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్నారు.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం... విధులు నిర్వహించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా అల్లరిమూక శర్మపై దాడి చేసింది. ఆయనను హతమార్చి, పక్కనే ఉన్న మురికి కాల్వలో పడేసింది. అతని శరీరంపై బుల్లెట్ గాయాలు ఉన్నాయి. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. మరోవైపు, అంకిత్ శర్మ హత్య నేపథ్యంలో ఢిల్లీలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.

Delhi
Clashes
Intelligence Bureau Official
Murder
  • Loading...

More Telugu News