Chandrabose: 'పాక్ లో చిన్నతరహా పరిశ్రమ' అంటూ ఆసక్తికర ట్వీట్ చేసిన లిరిక్ రైటర్ చంద్రబోస్

Tollywood lyric writer makes interesting tweet

  • ట్విట్టర్ లో వీడియో పోస్టు చేసిన చంద్రబోస్
  • భారత కరెన్సీ నోట్లకు నకిలీ నోట్లు తయారుచేస్తున్న వ్యక్తులు
  • అసలును మరిపించేలా ఉన్న దొంగనోట్లు

తెలుగులో అనేక హిట్ పాటలకు సాహిత్యం అందించిన ప్రముఖ లిరిక్ రైటర్ చంద్రబోస్ ట్విట్టర్ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ వీడియో పోస్టు చేసి పాక్ లో చిన్న తరహా పరిశ్రమ అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. ఇంతకీ ఆ వీడియోలో ఏంచేస్తున్నారో తెలుసా...? ఓ భారీ ప్రెస్ లో కొందరు వ్యక్తులు భారత కరెన్సీ నోట్లకు నకిలీలు ముద్రించి వాటిని కట్టలుగా కడుతూ విపరీతమైన బిజీగా ఉన్నారు. అన్నీ పెళపెళలాడే కొత్త నోట్లే. అసలు నోట్లను మరిపించేంత నైపుణ్యంతో తయారైన సిసలైన నకిలీ నోట్లు. భారత్ నోట్లకు దొంగనోట్లు తయారుచేయడం పాక్ లో కుటీర పరిశ్రమగా వర్థిల్లుతోందన్న కోణంలో చంద్రబోస్ చేసిన ఈ వీడియో ట్వీట్ విశేషంగా ఆకట్టుకుంటోంది. దీన్ని దర్శకుడు హరీశ్ శంకర్ కూడా లైక్ చేశారు.

Chandrabose
Lyric Writer
Pakistan
Small Scale Industry
Twitter
Video
  • Error fetching data: Network response was not ok

More Telugu News