Arvind Kejriwal: ఢిల్లీ ప్రజలు ఇంతలా బాధలు పడుతుండడం చూడలేకపోతున్నాను: కేజ్రీవాల్

Delhi CM Kejriwal upsets with anti CAA consequences

  • ఢిల్లీలో పెచ్చరిల్లిన సీఏఏ వ్యతిరేక అల్లర్లు
  • 20 మంది చనిపోయారన్న సీఎం కేజ్రీవాల్
  • బాధ్యులను వదలకూడదని వ్యాఖ్యలు

ఢిల్లీలో సీఏఏ వ్యతిరేక, అనుకూల నిరసనలు హింసాత్మకం కావడం పట్ల సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఏకంగా జీవితాలను కోల్పోవడం ఎంత విషాదం అంటూ ట్వీట్ చేశారు. 'ఇప్పటికే 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ఢిల్లీ ప్రజలు ఇంతలా బాధలు పడుతుండడం చూడలేకపోతున్నాను. ఈ ఘటనలకు బాధ్యులను వదలకూడదు. ఈ విషాదం నుంచి మేం త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. ప్రజలకు, అనేక వర్గాలకు జరిగిన నష్టాన్ని రూపుమాపే క్రమంలో అందరం కలిసి పనిచేయాలని కోరుకుంటున్నాను' అంటూ ట్వీట్ చేశారు.

Arvind Kejriwal
Delhi
Anti CAA
Deaths
AAP
  • Loading...

More Telugu News