Mahesh Babu: ఫ్యాన్స్‌కు పండగే..రణ్​వీర్​ సింగ్​తో మహేశ్ మల్టీస్టారర్‌‌!

Is Mahesh Babu going act with Ranveer Singh in a bollywood movie

  • బాలీవుడ్‌ సినిమాలో నటించేందుకు మహేశ్ ఆసక్తి?
  • ప్రస్తుతం ఓ యాడ్ లో నటిస్తున్న మహేశ్, రణ్వీర్
  • పూర్తి అయిన తర్వాత  సినిమా గురించి ప్రకటించే అవకాశం
  • నిర్మాతగా సాజిద్ నడియావాలా!

మహేశ్ బాబు అభిమానుల్లో జోష్ నింపే వార్త ఇది. టాలీవుడ్ సూపర్ స్టార్‌‌ బాలీవుడ్‌లో అడుగుపెట్టబోతున్నాడట. అది కూడా మామూలుగా కాదు. బాలీవుడ్‌లో ఇప్పుడు విపరీతమైన క్రేజ్‌ సంపాదించుకున్న యంగ్‌ హీరో రణ్‌వీర్‌‌ సింగ్‌తో కలిసి మల్టీస్టారర్‌లో మహేశ్ నటించబోతున్నాడని సమాచారం.

ప్రస్తుతం మహేశ్, రణ్‌వీర్‌‌ ముంబైలో ఓ వాణిజ్య ప్రకటన చిత్రం షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఈ షూట్‌ ముగిసిన వెంటనే  ప్రముఖ ప్రొడ్యూసర్‌‌ సాజిద్‌ నడియాడ్ వాలా నిర్మించే సినిమాకు సంతకం చేయబోతున్నారని తెలుస్తోంది. టాలీవుడ్, బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరోలతో  కలిసి హిందీలో ఓ ఫీచర్ ఫిల్మ్  తీయాలని సాజిద్ చాన్నాళ్ల నుంచి ప్లాన్‌ చేస్తున్నాడట. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఒకవేళ మహేశ్, రణ్‌వీర్‌‌ కలిస్తే ఓ క్రేజీ కాంబో కానుంది. ఎందుకంటే ఈ ఇద్దరూ భిన్న మనస్తత్వం కలవారు. మన టాలీవుడ్ సూపర్ స్టార్ చాలా నిదానంగా, రిజర్వ్‌డ్‌గా ఉంటే దానికి పూర్తి భిన్నంగా రణ్‌వీర్‌‌ తెగ అల్లరి చేస్తూ అందరితో ఇట్టే కలిసిపోతాడు. అయితే, విజాతి ధ్రువాలు ఆకర్షించినట్టు యాడ్ ఫిల్మ్ షూటింగ్‌లో ఇద్దరి మధ్య మంచి స్నేహం కుదిరిందట. మరి, ఈ ఇద్దరూ వెండితెరను పంచుకుంటారో లేదో చూడాలి.

Mahesh Babu
Ranveer Singh
Bollywood
movie
multi starrer
  • Loading...

More Telugu News