IYR Krishna Rao: భారత్‌లో ట్రంప్ పర్యటనపై ఐవైఆర్ కృష్ణారావు ఆసక్తికర వ్యాఖ్యలు

iyr krishnarao on trump visit in india

  • భారత దేశ ప్రయోజనాల దృష్ట్యా ఫలవంతమైన పర్యటన 
  • సీఏఏను అంతర్గత అంశంగా పేర్కొనడం మంచి పరిణామం
  • వాణిజ్యం విషయంలో వెసులుబాటు ఎవరికీ ఇవ్వడని అర్థం అయ్యింది 

భారత్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ చేసిన 36 గంటల పర్యటనపై ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆసియా-పసిఫిక్ ప్రాంతాల్లో మనదేశ ప్రాధాన్యాన్ని అమెరికా గుర్తించడం మంచి పరిణామమని ఆయన ట్వీట్ చేశారు.

'భారత దేశ ప్రయోజనాల దృష్ట్యా ఫలవంతమైన పర్యటన. రక్షణ సహకారం, ఆసియా-పసిఫిక్ ప్రాంతాల్లో భారత ప్రాధాన్యాన్ని అమెరికా గుర్తింపు.. మంచి పరిణామాలు. సీఏఏ, ఢిల్లీ సంఘటనలను అంతర్గత అంశాలుగా ట్రంపు పేర్కొనడం మంచి పరిణామం. వాణిజ్యం విషయంలో ప్రత్యేక వెసులుబాటు ట్రంపు ఎవరికీ ఇవ్వడని అర్థం అయ్యింది' అని ఆయన అభిప్రాయపడ్డారు.

IYR Krishna Rao
Andhra Pradesh
Donald Trump
India
  • Error fetching data: Network response was not ok

More Telugu News