Varun Tej: వరుణ్ తేజ్ తో తలపడనున్న నవీన్ చంద్ర

Kiran Korrapati Movie

  • బాక్సర్ గా కనిపించనున్న వరుణ్ తేజ్ 
  •  దర్శకుడిగా కిరణ్ కొర్రపాటి పరిచయం 
  •  జూలై 30వ తేదీన విడుదల  

నవీన్ చంద్ర మంచి నటుడు. తెలుగు .. తమిళ భాషల్లో నటుడిగా తనకి వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ వెళుతున్నాడు. ఒక వైపున హీరోగా వచ్చిన సినిమాలు చేస్తూనే, మరో వైపున విలన్ పాత్రలు చేస్తున్నాడు. అలా 'అరవింద సమేత' సినిమాలో ఆయన చేసిన విలన్ రోల్ మంచి పేరును తెచ్చిపెట్టింది. దాంతో ఆయన తమిళంలోను విలన్ గా బిజీ అవుతున్నాడు.

ఈ నేపథ్యంలోనే ఆయన వరుణ్ తేజ్ సినిమాలోను విలన్ గా చేయడానికి సిద్ధమవుతున్నాడు. వరుణ్ తేజ్ కథానాయకుడిగా కిరణ్ కొర్రపాటి ఒక సినిమా చేస్తున్నాడు. అల్లు బాబీ నిర్మిస్తున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ బాక్సర్ గా కనిపించనున్నాడు. ఆయనతో తలపడే విలన్ కూడా కథా పరంగా బాక్సర్ అయ్యుండాలి. అందువలన బాక్సింగ్ లో నిజంగా ప్రవేశమున్న ఆర్టిస్ట్ ను తీసుకోవాలని భావించారు. బాక్సింగ్ లో మంచి ప్రవేశమున్న నవీన్ చంద్రను విలన్ పాత్రకి ఎంపిక చేశారు. త్వరలోనే ఆయన ఈ సినిమా షూటింగులో పాల్గొననున్నట్టు తెలుస్తోంది. జూలై 30వ తేదీన విడుదల కానున్న ఈ సినిమాలో, కథానాయికగా కైరా అద్వాని పేరు వినిపిస్తోంది.

Varun Tej
Kiara Adwani
Naveen Chandra
Kiran Korrapati Movie
  • Loading...

More Telugu News