New Delhi: ఢిల్లీ అల్లర్లు: దుకాణంలోకి వచ్చి దాడి.. కుర్రాడి తలలో దిగిన డ్రిల్లింగ్‌ మెషీన్‌!

a portion of drill machine youngster head

  • సీఏఏకు వ్యతిరేకంగా ఢిల్లీలో కొనసాగుతున్న ఆందోళనలు
  • కొన్ని చోట్ల అవాంఛనీయ ఘటనలు 
  • దుకాణంలో పనిచేసుకుంటున్న సమయంలో యువకుడిపై దాడి

పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) వ్యతిరేకంగా, అనుకూలంగా ఢిల్లీలో కొనసాగుతున్న ఆందోళనల్లో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణలు జరుగుతున్నాయి. ప్రత్యర్థి వర్గం వారి దుకాణాలు, వ్యాపారాలపై ఓ వర్గం వారు దాడులు చేస్తూ వాటిని తగలబెట్టారు. ఈ క్రమంలో వివేక్‌ (19) అనే యువకుడి తలలోకి డ్రిల్లింగ్‌ మెషీన్‌ చొచ్చుకెళ్లింది.

వివేక్‌ తన దుకాణంలో పనిచేసుకుంటున్న సమయంలో అందులోకి దూసుకొచ్చిన ఓ వర్గం వారు దాడి చేయడంతో..  వివేక్‌ చేతిలో ఉన్న డ్రిల్లింగ్ మెషీన్‌ అతని తలలోకి దిగింది. దీంతో అతనిని వెంటనే ఆసుపత్రిలో చేర్చారు. అతడికి సంబంధించిన ఫొటోను పాయల్‌ మెహతా అనే యువతి ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ఇందుకు సంబంధించిన ఎక్స్‌రే రిపోర్టు కూడా వచ్చింది. ఢిల్లీలో కొందరు మారణాయుధాలతో వీధుల్లో తిరుగుతూ కలకలం రేపుతున్నారు.

New Delhi
CAA
  • Error fetching data: Network response was not ok

More Telugu News