Akkineni: తాత, తండ్రి అడుగుజాడల్లో వెళ్తున్న నాగచైతన్య

Naga Chaitanya to start own production house

  • నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టబోతున్న నాగచైతన్య
  • సొంత బ్యానర్ ఏర్పాటు చేయబోతున్న అక్కినేని హీరో
  • రాజ్ తరుణ్ తో తొలి సినిమా అంటూ వార్తలు

అక్కినేని కుటుంబానికి చెందిన అన్నపూర్ణ స్టూడియోస్ ఎన్నో మంచి చిత్రాలను నిర్మించి, ప్రేక్షకుల మదిలో మంచి స్థానాన్ని సంపాదించుకుంది. దివంగత నాగేశ్వరరావు ఈ స్టూడియోస్ ను ప్రారంభించారు. ఆ తర్వాత అక్కినేని నాగార్జున కూడా నిర్మాతగా పలు చిత్రాలను నిర్మించారు. సొంతంగా 'మనం ఎంటర్ ప్రైజెస్' బ్యానర్ ను కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆ కుటుంబంలో మూడో తరం కూడా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టబోతోంది.

తాజా సమాచారం ప్రకారం అక్కినేని నాగచైతన్య సొంత బ్యానర్ ను ఏర్పాటు చేయబోతున్నాడు. కొత్త టాలెంట్ ను, కొత్త కాన్సెప్ట్ చిత్రాలను ఎంకరేజ్ చేసేలా సినిమాలను నిర్మించాలనుకుంటున్నాడు. యంగ్ హీరో రాజ్ తరుణ్ తో ఓ చిత్రాన్ని నిర్మించేందుకు ఇప్పటికే రెడీ అయ్యాడని తెలుస్తోంది. ఈ వార్తలపై అక్కినేని ఫ్యామిలీ ఇంకా అధికారికంగా స్పందించాల్సి ఉంది.

Akkineni
Naga Chaitanya
New Banner
Tollywood
  • Loading...

More Telugu News