KCR: ఢిల్లీ విందులో ట్రంప్​తో సీఎం కేసీఆర్​ ముచ్చట్లు

kcr meets trump at Delhi program

  • విందు సమయంలో కేసీఆర్ తో కరచాలనం చేసిన ట్రంప్
  • జీఈఎస్ సదస్సు విషయాన్ని ప్రస్తావించిన అమెరికా ప్రెసిడెంట్
  • మీరూ వస్తారని ఎదురుచూశామన్న కేసీఆర్
  • ట్రంప్ కు కరీంనగర్ వెండి ఫిలిగ్రీ బహుమతులు అందజేసిన తెలంగాణ సీఎం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీలో రాష్ట్రపతి ఇచ్చిన విందు సందర్భంగా మాటా మాటా కలిపారు. వరుసగా నేతలను కలుస్తూ వచ్చిన ట్రంప్.. కేసీఆర్ కు కరచాలనం చేసి, కొన్ని క్షణాలు మాట్లాడారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లో నిర్వహించిన గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ (జీఈఎస్) సదస్సు విషయాన్ని ప్రస్తావించారు. తన కుమార్తె ఇవాంకా హాజరైన ఆ సదస్సుకు తెలంగాణ ఇచ్చిన ఆతిథ్యం భేష్ అని అభినందించారు. ఈ సందర్భంగా కేసీఆర్ స్పందిస్తూ.. సదస్సుకు మీరు కూడా హాజరవుతారని భావించామని చెప్పారు. ఇవాంకా వచ్చి అందరినీ ఆకట్టుకున్నారని చెప్పారు. దీంతో తాను సదస్సుకు రావాలనుకున్నా వీలుకాలేదని ట్రంప్ పేర్కొన్నట్టు సమాచారం.

ట్రంప్ కు కరీంనగర్ వెండి ఫిలిగ్రీ బహుమతులు

ఢిల్లీ విందు సందర్భంగా సీఎం కేసీఆర్ కరీంనగర్ కు చెందిన కళాకారులు తయారు చేసిన వెండి ఫిలిగ్రీ కళాకృతులను ట్రంప్ కు బహూకరించారు. ఇందులో చార్మినార్, నెమలి, కాకతీయ కళాతోరణం, వీణ వంటి ఆకృతులు ఉన్నాయి. ఇక ట్రంప్ సతీమణి మెలనియాకు ఎర్ర రంగు పోచంపల్లి పట్టుచీరను బహూకరించినట్టు సమాచారం.

KCR
Donald Trump
Namaste Trump
New Delhi
Ivanka Trump
  • Loading...

More Telugu News