CAA: పోలీసుల అదుపులో ఢిల్లీ కాల్పుల నిందితుడు షారూఖ్

Delhi police arrested shooter

  • సీఏఏ అనుకూల-వ్యతిరేక వర్గాల ఆందోళన
  • గుంపులోంచి వచ్చి కాల్పులు జరిపిన నిందితుడు
  • నిందితుడిని 33 ఏళ్ల షారూఖ్‌గా గుర్తింపు

పౌరసత్వ వ్యతిరేక చట్టానికి అనుకూలంగా, వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలతో దేశ రాజధాని ఢిల్లీ మంగళవారం అట్టుడికింది. మరోవైపు, గుంపు నుంచి అకస్మాత్తుగా దూసుకొచ్చిన ఓ యువకుడు మరో గ్రూపుపై కాల్పులు జరపడంతో ఆందోళనలు కాస్తా హింసాత్మకంగా మారాయి. ఈ ఘటనల్లో ఇప్పటి వరకు ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. నిందితుడు కాల్పులు జరిపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు స్పందించారు.

దర్యాప్తు చేపట్టి షాదార ప్రాంతానికి చెందిన నిందితుడు షారూఖ్ (33)ను అదుపులోకి తీసుకున్నారు. జఫ్రాబాద్‌లో ఆందోళనకారుల మధ్య నుంచి వచ్చిన ఓ వ్యక్తి కాల్పులు జరపడాన్ని చూసినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపైనా అతడు తుపాకి గురిపెట్టినట్టు చెప్పారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిపై ఆయుధ చట్టం కింద కేసు నమోదు చేశారు.

CAA
New Delhi
Police
violence
Sharukh
  • Loading...

More Telugu News