Asaduddin Owaisi: హైదరాబాద్‌లో కూర్చోకుండా ఢిల్లీకి వెళ్లి హింసను అదుపుచేయొచ్చుగా?: కిషన్ రెడ్డిపై అసదుద్దీన్‌ ఒవైసీ ఆగ్రహం

Go and control situation in Delhi Owaisi to  Kishan Reddy

  • కిషన్‌రెడ్డిపై కస్సుమన్న ఒవైసీ
  • నా నామ స్మరణ చేస్తూ స్వీట్లు తింటూ కూర్చోవద్దు
  • దేశ రాజధానిలో రెండో రోజు కూడా హింస చెలరేగింది
  • కిషన్‌రెడ్డి ఇతరులపై నిందలు వేస్తున్నారు

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డిపై ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. 'హైదరాబాద్‌లో కూర్చునే కన్నా ఆయన ఢిల్లీకి వెళ్లి అక్కడి పరిస్థితిని అదుపు చేయాలి. నా నామ స్మరణ చేస్తూ, స్వీట్లు తింటూ ఇక్కడ కూర్చోవద్దు. దేశ రాజధానిలో రెండో రోజు కూడా హింస చెలరేగింది. మరోవైపు ఆ కేంద్ర సహాయ మంత్రి మాత్రం ఇక్కడ కూర్చొని ఇతరులపై నిందలు వేస్తున్నారు' అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాగా, ఢిల్లీలో హింసపై కిషన్‌రెడ్డి స్పందిస్తూ... 'ఒక్క అసదుద్దీన్‌ ఒవైసీ కాదు.. లక్షలాది మంది ఒవైసీలు వచ్చినా పౌరసత్వ సవరణ చట్టాన్ని వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదు' అని చెప్పారు. కాగా, ఈశాన్య ఢిల్లీలో చెలరేగిన హింసలో దాదాపు 10 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో పోలీసు కానిస్టేబుల్‌ కూడా ఉన్నాడు. మరో 150 మందికి గాయాలయ్యాయి.  

Asaduddin Owaisi
MIM
Kishan Reddy
BJP
  • Loading...

More Telugu News