Donald Trump: ట్రంప్ దంపతులకు రాష్ట్రపతి కోవింద్‌ విందు.. ఘనస్వాగతం.. ప్రముఖుల హాజరు!

trump visits rashtrapati bhavan

  • ట్రంప్ గౌరవార్థం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ విందు 
  • హాజరైన పలు రాష్ట్రాల సీఎంలు 
  • రాత్రి 10 గంటలకు అమెరికాకు తిరిగి వెళ్లనున్న ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌లో పర్యటిస్తోన్న నేపథ్యంలో ఆయన గౌరవార్థం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ విందు ఇస్తున్నారు. ట్రంప్‌ దంపతులకు కోవింద్‌ దంపతులు స్వాగతం పలికారు. ఈ విందులో తెలంగాణ సీఎం కేసీఆర్‌తో పాటు అసోం, హర్యానా, కర్ణాటక, బీహార్‌, మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిశాల సీఎంలు కూడా హాజరవుతున్నారు.          
ట్రంప్‌ దంపతులకు కోవింద్‌ పలు అంశాలను వివరించి చెబుతున్నారు. రాష్ట్రపతి భవన్‌లో జరుగుతోన్న ఈ విందు కార్యక్రమం ముగిశాక ఈ రోజు రాత్రి దాదాపు 10 గంటలకు ట్రంప్ అమెరికాకు తిరిగి వెళ్లనున్నారు.      
విందులో దాల్‌ రైసీనా, మటన్‌ బిర్యానీ, ర్యాన్‌, మష్రూమ్‌ డిష్‌, హాజల్‌నట్‌ ఆపిల్‌, వెనీలా ఐస్‌క్రీం, మాల్పువా విత్‌ రాబ్డీతో పాటు నోరూరించే ఎన్నో వంటకాలను సిద్ధం చేశారు.

Donald Trump
america
Ram Nath Kovind
India
  • Loading...

More Telugu News