Kashvee Gautam: అమ్మాయిల క్రికెట్ లో అద్భుతం... ప్రత్యర్థి జట్టులో అందర్నీ అవుట్ చేసిన కశ్వీ

Kashvi Gutam set record with 10 wickets

  • కడపలో అండర్-19 మహిళల క్రికెట్ లీగ్
  • చండీగఢ్-అరుణాచల్ ప్రదేశ్ జట్ల మధ్య మ్యాచ్
  • 4.5 ఓవర్లు విసిరి 10 వికెట్లు తీసిన కశ్వీ గౌతమ్
  • 25 పరుగులకు ఆలౌట్ అయిన అరుణాచల్ ప్రదేశ్
  • అతి భారీ విజయం సాధించిన చండీగఢ్

అప్పుడెప్పుడో జిమ్ లేకర్ సాధించిన 10 వికెట్ల రికార్డును అనిల్ కుంబ్లే రిపీట్ చేస్తే మురిసిపోయాం. ఇప్పుడు అమ్మాయిల క్రికెట్ లో కూడా ఈ అద్భుతం జరిగింది. అరుణాచల్ ప్రదేశ్-చండీగఢ్ జట్ల మధ్య కడపలో జరుగుతున్న పేటీఎం అండర్-19 మహిళల క్రికెట్ మ్యాచ్ లో ఈ ఫీట్ నమోదైంది. చండీగఢ్ కెప్టెన్ కశ్వీ గౌతమ్ తానొక్కతే ప్రత్యర్థి జట్టులోని మొత్తం బ్యాట్స్ ఉమెన్ ను పెవిలియన్ కు పంపి రికార్డు సాధించింది. మొత్తం 10 వికెట్లను తన ఖాతాలో వేసుకుంది. అంతకుముందు, అమ్మడు బ్యాటింగ్ లోనూ అదరగొట్టింది.

ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన చండీగఢ్ 50 ఓవర్లలో 4 వికెట్లకు 186 పరుగులు చేసింది. కశ్వీ గౌతమ్ 49 పరుగులతో రాణించింది. ఆ తర్వాత బౌలింగ్ లోనూ విజృంభించి కేవలం 4.5 ఓవర్లలో 12 పరుగులిచ్చి 10 వికెట్లు తీసింది. దాంతో అరుణాచల్ ప్రదేశ్ అమ్మాయిలు మరీ దయనీయంగా 8.5 ఓవర్లలో 25 పరుగులకు ఆలౌట్ అయ్యారు. అరుణాచల్ ప్రదేశ్ జట్టులో మొత్తం 8 మంది అమ్మాయిలు డకౌట్ అయ్యారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News