Boeing: అపాచీ హెలికాప్టర్ కీలక భాగాలు హైదరాబాదులోనే తయారవుతాయని మీకు తెలుసా?: బోయింగ్

Boeing India welcomes Trump decision to give India Apaches

  • భారత్ కు అధునాతన అపాచీ ఛాపర్లను ఇస్తామన్న ట్రంప్
  • ట్రంప్ ప్రకటనను స్వాగతించిన అపాచీ తయారీదారు బోయింగ్
  • భారత్ తో భాగస్వామ్యానికి ఎంతో ఆసక్తిగా వేచిచూస్తున్నామని ట్వీట్

డొనాల్డ్ ట్రంప్ పర్యటనతో అమెరికా, భారత్ మధ్య వాణిజ్య సంబంధాలు మరోస్థాయికి చేరతాయన్నది సుస్పష్టం. ఆయన పర్యటన సందర్భంగా 300 కోట్ల డాలర్ల మేర ఒప్పందాలకు బాటలు పరిచారు. భారత్ కు అత్యంత అధునాతన అపాచీ, రోమియో హెలికాప్టర్లను అందించేందుకు ఒప్పందాలు కుదుర్చుకుంటామని హామీ ఇచ్చారు. దీనిపై అపాచీ హెలికాప్టర్ల తయారీదారు బోయింగ్ సంస్థ ఇండియా విభాగం స్పందించింది. భారత రక్షణ శాఖతో తమ భాగస్వామ్యాన్ని ప్రారంభించేందుకు ఎంతో ఉద్విగ్నంగా ఉన్నామని తెలిపింది. భారత్ కు అపాచీ ఏహెచ్64ఈ పోరాట హెలికాప్టర్లను అందిస్తామని పేర్కొంది.

అపాచీ ప్రపంచంలోనే అత్యుత్తమ పోరాట హెలికాప్టర్ అని, ఇది అత్యంత అధునాతన బహుళ ప్రయోజనకారి అని స్పష్టం చేసింది. ఒకసారి ఈ హెలికాప్టర్లను విక్రయించాక జీవితకాలం మద్దతు సేవలు అందిస్తామని బోయింగ్ ఇండియా తన ట్వీట్ లో వెల్లడించింది. అంతేకాదు, "మీకు ఈ విషయం తెలుసా..? భారత ఆర్మీ కోసం ప్రత్యేకంగా రూపొందించే అపాచీ హెలికాప్టర్లలో ఉపయోగించే కీలక విడిభాగాలు ఫ్యూసిలేజ్, ఏరో స్ట్రక్చర్స్ హైదరాబాదులోనే తయారవుతాయి" అంటూ ట్వీట్ చేసింది.

  • Loading...

More Telugu News