Amaravati: పేదలకు అమరావతి భూముల పంపిణీ కోసం జీవో జారీ చేసిన ఏపీ సర్కారు

AP Government issues G O to distribute Amaravathi lands to poor

  • నవరత్నాలు పథకంలో భాగంగా ఏపీ ప్రభుత్వ నిర్ణయం
  • రాజధాని గ్రామాల్లోని భూములు ఇకపై పేదలకు
  • 1251.5 ఎకరాల భూమి పంపిణీకి సిద్ధం!
  • 54,307 వేల మంది లబ్దిదారుల ఎంపిక!

రాష్ట్రంలోని పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసే దిశగా ఏపీ ప్రభుత్వం ముందడుగు వేసింది. అర్హులైన పేదలకు అమరావతి భూములు పంపిణీ చేసేందుకు తాజాగా జీవో జారీ చేసింది. నవరత్నాలు పథకంలో భాగంగా, గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని పేదలకు అమరావతిలోని నివాసయోగ్యమైన స్థలాలను పంపిణీ చేయనున్నారు.

 ఇందులో భాగంగా నవులూరు, క్రిష్ణాయపాలెం, నిడమర్రు, ఐనవోలు, కురుగల్, మందడం గ్రామాల్లోని భూములను  మంగళగిరి, పెదకాకాని, తాడేపల్లి, దుగ్గిరాల మండలాలు, విజయవాడ పరిథిలోని  లబ్దిదారులకు ఒక్కొక్కరికి ఒక సెంటు భూమి చొప్పున  పంపిణీ చేసేందుకు  ఏర్పాట్లు జరుగుతున్నాయి. మొత్తం  1251.5 ఎకరాల భూమిని 54,307 మంది లబ్దిదారులకు పంపిణీ చేసేందుకు జీవో జారీ చేశారు.

  • Loading...

More Telugu News