Chandrababu: నా క్లాస్ మేట్ రత్నంను కలిశాను... మనసుకు తెలియని ఉత్సాహం వచ్చింది: చంద్రబాబు

Chandrababu tweets about his classmate

  • కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటన
  • కంగుంది గ్రామంలో బాల్య స్నేహితుడి నివాసానికి వెళ్లిన చంద్రబాబు
  • పాత ఫొటోలు చూపించిన స్నేహితుడు
  • భావోద్వేగాలకు గురైన చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కుప్పం నియోజకవర్గంలో ప్రజా చైతన్యయాత్ర చేపడుతున్నారు. ఈ సందర్భంగా ఆయన తన బాల్యమిత్రుడు రత్నంను కలిశారు. దీనిపై ఆయన ట్విట్టర్ లో వెల్లడించారు. 'కుప్పం నియోజకవర్గంలోని కంగుంది గ్రామానికి వెళ్లి నా క్లాస్ మేట్ రత్నాన్ని కలిశాను. రత్నం నాడు మేం ఎస్వీ యూనివర్శిటీలో చదివినప్పటి ఫొటోలు చూపించాడు. మా బ్యాచ్ వాళ్ల ఫొటోలు చూడగానే ఒక్కసారిగా కాలేజీ రోజులు, అప్పటి స్నేహాలు గుర్తొచ్చాయి. మనసుకు తెలియని ఉత్సాహం వచ్చింది' అంటూ భావోద్వేగాలతో ట్వీట్ చేశారు. అంతేకాదు, రత్నం తండ్రి 98 ఏళ్ల శ్యామ్ గారిని కూడా కలిశానని, ఆయన ఆశీస్సులు అందుకున్నానని చంద్రబాబు వెల్లడించారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News