PV Sindhu: సీఎం జగన్ ఎంతో కృషి చేస్తున్నారు, ఎవరైనా అవినీతికి పాల్పడితే సమాచారం అందించండి: పీవీ సింధు

PV Sindhu campaigns for AP Government

  • అవినీతికి పాల్పడితే 14400 నెంబర్ కు ఫోన్ చేయాలని సూచన
  • అవినీతిపై నిర్భయంగా గొంతుక వినిపించాలని పిలుపు
  • ప్రచార వీడియో విడుదల చేసిన సీఎం జగన్

ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు ఏపీ ప్రభుత్వం తరఫున ఓ వీడియో సందేశం అందించారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అవినీతి రహిత సమాజం కోసం ఎంతో కృషి చేస్తున్నారని, ఎవరైనా అవినీతికి పాల్పడితే 14400 అనే టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసి సమాచారం అందించాలని పీవీ సింధు సూచించారు. ఎవరు అవినీతికి పాల్పడినా భయం లేకుండా మీ గొంతుక వినిపించండి అంటూ పిలుపునిచ్చారు. ప్రభుత్వ శాఖల్లో అవినీతి నిర్మూలన జరగాలని భావిస్తున్న సీఎం జగన్, ఆ దిశగా 14400 టోల్ ఫ్రీ నెంబర్ ను కూడా తీసుకువచ్చారు. తాజాగా, దీనికి సంబంధించిన ప్రచార వీడియోలను జగన్ విడుదల చేశారు.

PV Sindhu
Jagan
Anti Corruption
Video
Andhra Pradesh
YSRCP
  • Error fetching data: Network response was not ok

More Telugu News