Nagababu: చాలా వర్గాల్లో ఇంకా ఈ కుల పిచ్చి పోవడంలేదు: నాగబాబు

Nagababu comments on cast issues

  • ఎన్ని రకాలుగా కష్టపడుతున్నా ఇదేంటని వ్యాఖ్యలు
  • ఏపీలో కులపిచ్చి కొనసాగుతూనే ఉందని వెల్లడి
  • కుల భూతాల నుంచి ఏపీని కాపాడు దేవుడా అంటూ ట్వీట్

జనసేన నేత, మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియాలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్ని రకాలుగా కష్టపడుతున్నా మన ఏపీలో కుల పిచ్చి కొనసాగుతూనే ఉందని పేర్కొన్నారు. చాలా వర్గాల్లో ఇంకా కుల పిచ్చి తొలగిపోవడం లేదని అభిప్రాయపడ్డారు. 'ఈ కుల భూతాల నుంచి ఏపీని కాపాడు దేవుడా' అంటూ ట్వీట్ చేశారు. పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేనలో అడుగుపెట్టిన తర్వాత నాగబాబు సామాజిక అంశాలపై ఎక్కువగా స్పందిస్తున్నారు. ఎంపీగా పోటీ చేసి ఓటమిపాలైనా, కీలక అంశాలపై స్పందించడం మాత్రం ఆపలేదు.

Nagababu
Janasena
Cast
Andhra Pradesh
Communities
  • Loading...

More Telugu News