Melania Trump: ఈ ఆనందాన్ని మాటల్లో చెప్పలేను: మెలానియా

Melania Trump says about India tour no words to explain

  • ఢిల్లీలో ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన మెలానియా
  • హ్యాపీనెస్ క్లాసులో చిన్నారులతో ఉత్సాహంగా గడిపిన వైనం
  • భారత పర్యటన ఓ అద్భుతమని అభివర్ణన

అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ ఢిల్లీలో ఓ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన హ్యాపీనెస్ క్లాసుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె చిన్నారులతో ఉత్సాహంగా గడిపారు. ఢిల్లీలోని దక్షిణ మోతీబాగ్ లో ఉన్న సర్వోదయ కో ఎడ్యుకేషనల్ సీనియర్ సెకండరీ స్కూల్ ను సందర్శించిన మెలానియా అక్కడి బోధనా విధానాన్ని పరిశీలించి ఆశ్చర్యపోయారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఢిల్లీ ప్రభుత్వం అమలు చేస్తున్న హ్యాపీనెస్ క్లాసులతో చిన్నారులే కాకుండా తాను కూడా స్ఫూర్తి పొందానని తెలిపారు. ఇలాంటి ఆనంద భరిత కార్యక్రమాలతో విద్యార్థులు తమ రోజును ప్రారంభించడం హర్షణీయం అని పేర్కొన్నారు. తాను భారత్ రావడం ఇదే తొలిసారి అని, తన పర్యటన ఎంత అద్భుతంగా ఉందో ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పలేనని అన్నారు. ఈ పర్యటన సాగుతున్న తీరు పట్ల అధ్యక్షుడు ట్రంప్, తాను ఎంతో సంతోషంగా ఉన్నామని మెలానియా వివరించారు. తనను సంప్రదాయ విధానంలో స్వాగతించడాన్ని మరువలేనని తెలిపారు.

Melania Trump
Donald Trump
  • Loading...

More Telugu News