Nani: నాని కొత్త చిత్రం పునర్జన్మల నేపథ్యంలో సాగుతుందట!

Shyam Singa Rai Movie

  • నాని తదుపరి చిత్రంగా 'శ్యామ్ సింగ రాయ్'
  • రెండు ప్రేమకథల అల్లికగా సాగే సినిమా 
  • దర్శకుడిగా రాహుల్ సాంకృత్యన్

నాని కొత్త చిత్రంగా 'శ్యామ్ సింగ రాయ్' అనే చిత్రం రూపొందనున్నట్టుగా అధికారిక ప్రకటన వచ్చేసింది. నాని పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని టైటిల్ పోస్టర్ ను కూడా వదిలారు. 'టాక్సీవాలా'తో హిట్ కొట్టిన రాహుల్ ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.

ఈ సినిమాలో రెండు ప్రేమకథలు ఉంటాయని తెలుస్తోంది. ఒక ప్రేమకథ హైదరాబాద్ నేపథ్యంలో .. మరో ప్రేమకథ కోల్ కతా నేపథ్యంలో సాగనున్నట్టుగా చెబుతున్నారు. ఈ రెండు ప్రేమకథల మధ్య పునర్జన్మకి సంబంధించిన లింక్ ఉంటుందని అంటున్నారు. అంటే ఇది పునర్జన్మల నేపథ్యంలో సాగే కథ అని తెలుస్తోంది. అలా చూసుకుంటే నాని రెండు పాత్రలలో కనిపిస్తాడనుకోవచ్చు. టైటిల్ ను రాసిన విధానాన్ని బట్టి చూస్తే, మూడు పాత్రలు ఉండవచ్చనిపిస్తోంది. మొత్తానికి నాని ఒక కొత్త కథ .. కొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకులను పలకరించనున్నాడనే విషయం మాత్రం అర్థమవుతోంది. ఈ సినిమాకి సంబంధించిన మిగతా వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

Nani
Rahul
Shyam Singa Rai Movie
  • Loading...

More Telugu News