Software Engineer: దుప్పటితో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్ వేర్ ఇంజినీరు

IT Engineer commits suicide in Hyderabad

  • హైదరాబాదులో స్నేహితుడితో కలిసి నివసిస్తున్న కోల్ కతా యువకుడు
  • ఊరెళ్లిన స్నేహితుడు
  • సోదరి ఫోన్ చేసినా లిఫ్ట్ చేయని యువకుడు
  • అతని స్నేహితుడికి సమాచారం అందించిన సోదరి

హైదరాబాద్ లో ఓ ఐటీ నిపుణుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. అగ్నీశ్వర్ చక్రవర్తి అనే యువకుడు కొండాపూర్ లోని ఓ సంస్థలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్నాడు. 30 ఏళ్ల అగ్నీశ్వర్ స్వస్థలం కోల్ కతా. సప్తర్షి ముఖర్జీ అనే తన స్నేహితుడితో కలిసి కొండాపూర్ ప్రశాంత్ నగర్ లో నివసిస్తున్నాడు. అయితే అగ్నీశ్వర్ కు అతని సోదరి ఫోన్ చేయగా లిఫ్ట్ చేయకపోవడంతో ఆమె సప్తర్షికి సమాచారం అందించింది. ఆ సమయంలో సప్తర్షి వైజాగ్ లో ఉన్నాడు. సోమవారం హైదరాబాద్ వచ్చిన సప్తర్షి పోలీసులకు సమాచారం అందించడంతో వారు రూమ్ తలుపులు తీయగా, దుప్పటితో ఉరేసుకున్న స్థితిలో అగ్నీశ్వర్ విగతజీవుడిగా కనిపించాడు. ఇది ఆత్మహత్య అయ్యుంటుందని పోలీసులు ప్రాథమికంగా ఓ అంచనాకొచ్చారు.

Software Engineer
Hyderabad
Suicide
Kolkata
Police
  • Loading...

More Telugu News