Rekha: ఆ సినిమా తరువాత లవ్ లెటర్స్ విపరీతంగా వచ్చాయి: 'ఆనందం' హీరోయిన్

Chitra Kannada Movie

  • కెరియర్లో మొదటి సినిమా 'చిత్ర'
  • తొలి మూడు సినిమాలు 175 రోజులు ఆడాయి 
  • రక్తంతో లవ్ లెటర్స్ రాశారన్న రేఖ

'ఆనందం' సినిమాతో  తెలుగు తెరకి రేఖ పరిచయమైంది. విశాలమైన కళ్లతో ఆమె పలికించిన హావభావాలకు కుర్రకారు ఫిదా అయ్యారు. 5 భాషల్లో ఆమె 40 సినిమాల వరకూ చేసింది. తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ .. " కన్నడలో నేను 'చిత్ర' సినిమా చేశాను. హీరోయిన్ గా నాకు అది మొదటి సినిమా. అందులో నేను చాలా గ్లామరస్ గా కనిపిస్తాను.

సినిమాలో నేను కనిపించగానే కొంతమంది అభిమానులు చిల్లర డబ్బులు తెరపైకి చల్లేవారట. ఆ విషయం తెలిసి నాకు చాలా సంతోషం కలిగింది. ఆ సినిమా తరువాత నా క్రేజ్ పెరిగిపోయింది. అభిమానుల నుంచి లవ్ లెటర్స్ ఎక్కువగా వచ్చేవి. ఒక అభిమాని అయితే రక్తంతో లవ్ లెటర్ రాశాడు. నిజం చెప్పాలంటే ఆ లవ్ లెటర్ చూసి నేను చాలా భయపడిపోయాను. ఆ సినిమా సక్సెస్ .. దానితో వచ్చిన గుర్తింపును నేను ఎప్పటికీ మరిచిపోలేను. నా తొలి సినిమానేకాదు, ఆ తరువాత వచ్చిన రెండు సినిమాలు కూడా 175 రోజులు ఆడటం విశేషం" అని చెప్పుకొచ్చింది


  • Loading...

More Telugu News