Donald Trump: రాజ్ ఘాట్ సందర్శకుల పుస్తకంలో ట్రంప్ సందేశం

Trump visits Rajghat in New Delhi

  • భారత్ లో పర్యటిస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్
  • ఈ ఉదయం రాజ్ ఘాట్ సందర్శన
  • అపూర్వమైన గౌరవంగా భావిస్తున్నానని వెల్లడి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతం భారత్ లో పర్యటిస్తున్నారు. నేడు ఆయన కీలక సమావేశాలు జరపనున్నారు. అంతకుముందు ఆయన దేశ రాజధాని ఢిల్లీలో ప్రముఖ పర్యాటక ప్రాంతాలను దర్శిస్తున్నారు. ఈ క్రమంలో మహాత్ముడి దివ్య సమాధి రాజ్ ఘాట్ ను సందర్శించి అక్కడి విజిటర్స్ బుక్ లో తన సందేశం రాశారు. "సార్వభౌమ దేశం భారత్ తో అమెరికా ప్రజలు మరింత బలోపేతమైన బంధాలు కొనసాగిస్తారు. మహాత్మాగాంధీ మహోన్నత దార్శనికతను అమెరికా కూడా అనుసరిస్తుంది. ఇది మాకు దక్కిన అపూర్వమైన గౌరవంగా భావిస్తున్నాను" అంటూ పేర్కొన్నారు.

Donald Trump
India
New Delhi
Rajghat
USA
  • Loading...

More Telugu News