Donald Trump: రాష్ట్రపతి భవన్​ లో ట్రంప్​ కు అధికారిక స్వాగతం

Offical welcome to Donald Trump in Rastrapathi Bhavan

  • భారత్ లో యూఎస్ అధ్యక్షుడు ట్రంప్ రెండో రోజు పర్యటన
  • రాష్ట్రపతి భవన్ కు వెళ్లిన ట్రంప్ దంపతులు
  •  సాదర స్వాగతం పలికిన రామ్ నాథ్ కోవింద్, మోదీ

భారత పర్యటనలో భాగంగా యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. ఇందులో భాగంగా రాష్ట్రపతి భవన్ కు ట్రంప్ దంపతులు వెళ్లారు. ఈ సందర్భంగా వారికి అధికారిక స్వాగతం లభించింది. ట్రంప్ దంపతులకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీలు స్వాగతం పలికారు. త్రివిధ దళాల గౌరవ వందనాన్ని ట్రంప్ స్వీకరించారు. అనంతరం, రాజ్ ఘాట్ లో మహాత్ముడి సమాధిని దర్శించి నివాళులర్పించేందుకు ట్రంప్ దంపతులు వెళ్లారు.

Donald Trump
USA
president
India
Rastrapathi Bhavan
  • Loading...

More Telugu News