Nithin: 'టబు' పాత్రలో యాంకర్ అనసూయ?

Merlapaka Gandhi Movie

  • నితిన్ నిర్మాతగా 'అంధదూన్'
  • దర్శకుడిగా మేర్లపాక గాంధీ 
  •  త్వరలోనే రెగ్యులర్ షూటింగ్

ఒక వైపున హీరోగా వరుస సినిమాలు చేస్తున్న నితిన్, మరో వైపున నిర్మాతగాను సొంత బ్యానర్ పై సినిమాల నిర్మాణాన్ని కొనసాగిస్తున్నాడు. తాజాగా తన బ్యానర్ పై ఆయన 'అంధదూన్' సినిమాను రీమేక్ చేస్తున్నాడు. నిన్ననే ఈ సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకుంది. ఈ సినిమాకి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించనున్నాడు. హిందీ సినిమాలో 'టబు' చాలా కీలకమైన పాత్రను పోషించింది. ఆ పాత్ర ఆమెకి మంచి పేరు తెచ్చిపెట్టింది.

తెలుగులో ఆ పాత్ర కోసం కొంతమంది సీనియర్ కథానాయికల పేర్లను పరిశీలిస్తున్నటుగా వార్తలు వచ్చాయి. ఆ జాబితాలో యాంకర్ అనసూయ పేరు వున్నట్టుగా కూడా ప్రచారం జరిగింది. దాదాపు ఆ పాత్రకి అనసూయనే ఎంపిక చేయవచ్చనే టాక్ ఇప్పుడు ఫిల్మ్ నగర్లో బలంగా వినిపిస్తోంది. ఇటు బుల్లితెరపై .. అటు వెండితెరపై అనసూయకి విపరీతమైన క్రేజ్ వుంది. చేసిన సినిమాల సంఖ్య చాలా తక్కువైనా ఆమెకి వచ్చిన గుర్తింపు ఎక్కువ. హిందీలో 'టబు' పోషించిన పాత్ర తరహా నటనకి అనసూయ అయితేనే కరెక్ట్ గా ఉంటుందని భావిస్తున్నారట. ఈ పాత్ర పడితే అనసూయ మరింత లక్కీనే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Nithin
Anasuya
Merlapaka Gandhi Movie
  • Loading...

More Telugu News