Donald Trump: ట్రంప్ వచ్చింది వారి ఓట్ల కోసమే.. నేడు దేశవ్యాప్తంగా నిరసనలు: సీపీఐ నారాయణ

CPI Narayana blames Trump

  • ట్రంప్ ప్రపంచ ఉగ్రవాది
  • అమెరికాలో భారతీయులను హింసిస్తున్న ట్రంప్‌కు మోదీ స్వాగతమా?
  • విందుకు కేసీఆర్ వెళ్లొద్దు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనపై సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ఆరోపణలు గుప్పించారు. ట్రంప్‌ను ప్రపంచ ఉగ్రవాదిగా అభివర్ణించిన ఆయన.. అమెరికాలోని ప్రవాస భారతీయుల ఓట్ల కోసమే ఆయన భారత్‌లో పర్యటిస్తున్నారని ఆరోపించారు. మంచిర్యాలలో జరుగుతున్న సీపీఐ రాష్ట్రస్థాయి నిర్మాణ సదస్సులో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. నేటి ట్రంప్ పర్యటనను అడ్డుకుంటామని, దేశవ్యాప్తంగా నిరసనలు తెలియజేస్తామని, ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.

అమెరికాలోని భారతీయులను హింసిస్తున్న ట్రంప్‌కు మోదీ స్వాగతం పలకడం దారుణమన్నారు. భారత్‌కు మేలు చేస్తున్న ఇరాన్‌పై ట్రంప్ దాడులు చేస్తున్నారని, మెక్సికో సరిహద్దులో ట్రంప్ గోడ కడుతున్నట్టు మోదీ అహ్మదాబాద్‌లో కట్టారని ఎద్దేవా చేశారు. ట్రంప్ గౌరవార్థం రాష్ట్రపతి నేడు ఇచ్చే విందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కావొద్దని నారాయణ డిమాండ్ చేశారు.

Donald Trump
CPI Narayana
Narendra Modi
KCR
  • Loading...

More Telugu News