yeddyurappa: ట్రంప్‌తో విందుపై ఎటూ తేల్చుకోలేకపోతున్న యడియూరప్ప

Karnataka CM Yeddyurappa not yet decided about dinner with Trump

  • విందుకు ఆహ్వానం ఉంది
  • వేరే కార్యక్రమాలు ఉండడంతో నిర్ణయించుకోలేదు
  • ఒప్పందాలపై వేచి చూడాల్సిందే

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ నేడు ఇచ్చే విందుకు హాజరయ్యే విషయంలో కర్ణాటక సీఎం యడియూరప్ప ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. విందుకు తనకు ఆహ్వానం అందిందని, అయితే వేర్వేరు కార్యక్రమాలు ఉన్నందున ఇప్పటి వరకు ఎటువంటి నిర్ణయమూ తీసుకోలేదని సీఎం తెలిపారు. ట్రంప్ రెండు రోజుల పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య ఎటువంటి ఒప్పందాలు జరుగుతాయో వేచి చూడాల్సిందేనని అన్నారు. శివమొగ్గలో నిన్న విలేకరులతో మాట్లాడుతూ ఆయనీ విషయాన్ని వెల్లడించారు.

yeddyurappa
Karnataka
Donald Trump
President Of India
Dinner
  • Loading...

More Telugu News