vasantha nageswara rao: రాజకీయాలకు దూరంగా ఉంటున్నా.. దానిపై స్పందించలేను: వైసీపీ నేత వసంత నాగేశ్వరరావు

Vasantha Nageswara rao fires on Devineni Uma

  • దేవినేని ఆరోపణలను ఖండించిన వసంత
  • మూడు రాజధానులు ఇష్టం లేదని జగన్‌కు నిబ్బరంగా చెప్పేశాం
  • దేవినేనివి దిగజారుడు ఆరోపణలు

రాజకీయాలకు తాను దూరంగా ఉంటున్నానని, ఏపీ మూడు రాజధానులపై తాను స్పందించలేనని మాజీ మంత్రి, వైసీపీ నేత వసంత నాగేశ్వరరావు స్పష్టం చేశారు. నిన్న విజయవాడలో విలేకరులతో మాట్లాడిన ఆయన.. వ్యాపారాల కోసమే తాను మూడు రాజధానులకు మద్దతు ఇస్తున్నట్టు మాజీ మంత్రి దేవినేని చేసిన ఆరోపణలు అర్థరహితమని కొట్టిపడేశారు.

మూడు రాజధానుల ప్రతిపాదన తనకు, తమ ప్రాంత ప్రజలకు ఇష్టం లేదని తన కుమారుడు కృష్ణప్రసాద్ సీఎం జగన్ వద్ద నిర్భయంగా చెప్పేశాడని గుర్తు చేశారు. అమరావతిలో ఎంపీ నందిగం సురేశ్‌పై దాడి ఘటనలో తామే కేసులు పెట్టించామంటూ దేవినేని నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. శుభకార్యాలకు తమను పిలవొద్దని ఉమ పిలుపునివ్వడం ఆయన దిగజారుడు తనానికి నిదర్శనమని వసంత ఆగ్రహం వ్యక్తం చేశారు.

vasantha nageswara rao
YSRCP
Devineni Uma
Amaravati
  • Loading...

More Telugu News