Chandrababu: కుప్పంలో నేడు చంద్రబాబు రెండో రోజు పర్యటన

Chandrababu second day tour in kuppam

  • ప్రజా చైతన్య యాత్రలో భాగంగా రెండో రోజు  
  • దండికుప్పం, కంగుంది, గోవినపల్లె, విజలాపురంలో పర్యటన
  • శాంతిపురం మండల టీడీపీ నేతలతో సమావేశం 

చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు రెండో రోజు పర్యటన నేడు కొనసాగనుంది. ప్రజాచైతన్య యాత్రలో భాగంగా దండికుప్పం, కంగుంది, గోవినపల్లె, విజలాపురంలో ఆయన పర్యటించనున్నారు. శాంతిపురం ఎంపీడీవో కార్యాలయంలో మీడియాతో సమావేశమవుతారు. తర్వాత స్థానిక బాలాజీ కల్యాణమండపంలో జరిగే శాంతిపురం మండల టీడీపీ నేతల సమావేశంలో పాల్గొననున్నారు. కాగా, ఈరోజు రాత్రికి కుప్పం ఆర్ అండ్ బీ అతిథిగృహంలో చంద్రబాబు బస చేస్తారని, రేపు ఉదయం బెంగళూరుకు వెళతారని పార్టీ వర్గాల సమాచారం.

Chandrababu
Telugudesam
Praja Chaitanya Yatra
kuppam
Chittoor District
  • Loading...

More Telugu News