YSRCP: టీడీపీ మహిళా కార్యకర్తలే నాపై దాడిచేశారు.. చంద్రబాబే చేయించారు: వైసీపీ ఎంపీ నందిగం

YCP MP Nandigam Suresh blames attacked women are TDP Supporters

  • ‘సిట్’ నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే 
  • చంద్రబాబును అరెస్ట్ చేయాలి
  • దాడులకు గల్లా, ఆలపాటి రాజా దర్శకత్వం వహించారు

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుపై వైసీపీ ఎంపీ నందిగం సురేశ్ తీవ్ర ఆరోపణలు చేశారు. విజయవాడలో నిన్న మీడియాతో మాట్లాడిన ఆయన.. అమరావతిలో తనపై దాడిచేసింది పెయిడ్ ఆర్టిస్టులేనని అన్నారు. జేఏసీ ముసుగులో టీడీపీ మహిళా కార్యకర్తలు తనపై దాడిచేశారని, చంద్రబాబే దాడి చేయించారని ఆరోపించారు. వెంటనే ఆయనను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

అమరావతిలో రథోత్సవానికి వెళ్లేముందే తమ కార్లపై కొందరు దాడిచేశారని, ఈ క్రమంలోనే తన కారు వెనక ఉన్న ఓ పెద్దాయనను ఢీకొందని, వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించామని వివరించారు. చంద్రబాబు అక్రమాలపై సిట్ వేసినందున దాని నుంచి దృష్టి మరల్చేందుకే దాడులు చేయిస్తున్నారని అన్నారు. అంతేకాదు, ఈ దాడులకు గల్లా జయదేవ్, ఆలపాటి రాజా దర్శకత్వం వహించారని ఎంపీ ఆరోపించారు.

YSRCP
Nandigam Suresh
Chandrababu
Amaravati
  • Loading...

More Telugu News