Chandrababu: ఆ విషయం ఈ తుగ్లక్​ ముఖ్యమంత్రి గుర్తుపెట్టుకోవాలి: జగన్​ పై చంద్రబాబు ఫైర్​

Chandrababu naidu comments on YS Jagan

  • ఇంత చెత్త ముఖ్యమంత్రిని నేనెన్నడూ చూడలేదు
  • ప్రజల కోసం చేసేవి రాజకీయాలు, స్వార్థం కోసం చేసేవి కావు
  • ఎటువంటి ఒత్తిళ్లకు పోలీసులు లొంగొద్దు

వైసీపీ నేతల భూ అక్రమాలను ఎండగట్టేందుకు విశాఖపట్టణం వెళ్తున్నానని అన్నారు. ప్రజా చైతన్య యాత్రలో భాగంగా కుప్పం బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, ఇంటి స్థలం ఇస్తామంటూ అసైన్డ్ భూములు లాక్కుంటున్నారని, భూ సేకరణ చేసి పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు బోధనా ఫీజులు చెల్లించకుండా మోసం చేస్తూ వసతి దీవెన అంటున్నారని విమర్శించారు. రాష్ట్రంలో 18 లక్షల రేషన్ కార్డులు, 7 లక్షల పింఛన్లు తీసేశారని ప్రభుత్వంపై మండిపడ్డారు. రాష్ట్రంలో అభివృద్ధి కోసం తొమ్మిది నెలలుగా ఒక్క రూపాయి కూడా ఖర్చుపెట్టలేదని విమర్శించారు. తనపై గతంలో 26 కమిటీలు వేశారని, ఏమీ తేల్చలేకపోయారని, విచారణల పేరుతో వేధిస్తే రాష్ట్రానికి పెట్టుబడులు రావని  అన్నారు.

తన రాజకీయ జీవితంలో ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశాను కానీ, ఇంత చెత్త ముఖ్యమంత్రినీ, పనికిమాలిన ముఖ్యమంత్రిని చూడలేదంటూ సీఎం జగన్ పై మండిపడ్డారు. ప్రజల కోసం చేసేవి రాజకీయాలని స్వార్థం కోసం చేసేవి కావని, ఆ విషయాన్ని ఈ తుగ్లక్ ముఖ్యమంత్రి గుర్తుపెట్టుకోవాలంటూ జగన్ పై విరుచుకుపడ్డారు. ప్రజాస్వామ్యంలో మాట్లాడే హక్కు, విమర్శించే స్వేచ్ఛ ఉందని, తన హయాంలో పోలీసులను మంచి చేయమని చెబితే మంచి చేశారని, ఈరోజున చెడు చేయమంటే అదే చేస్తున్నారని, పోలీసులను తప్పుబట్టాల్సిన అవసరం లేదని, ఎటువంటి ఒత్తిళ్లకు లోనుకావొద్దని, చట్టాన్ని గౌరవించమని పోలీసులకు విజ్ఙప్తి చేస్తున్నానని అన్నారు.

Chandrababu
Telugudesam
Jagan
YSRCP
kuppam
Praja Chaitanya Yatra
  • Loading...

More Telugu News