Lakshmi Parvati: చంద్రబాబును అండమాన్‌ జైలుకు పంపించాలని ఉందని ఆయన నాతో అనేవారు: లక్ష్మీపార్వతి

AP Telugu Academy chairperson severe comments on Chandrababu

  • మళ్లీ అధికారంలోకొస్తే బాబును అండమాన్ జైలుకు పంపాలని ఉందని అనే వారు 
  • చంద్రబాబుకు ఆ రోజు త్వరలోనే వస్తుందని ఆశిస్తున్నా
  • బాబు, అచ్చెన్నాయుడు, సుజనాలు జైలుకు వెళ్లడం చూడాలని ఉంది 

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై ఏపీ తెలుగు అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీపార్వతి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో ఇవాళ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, తన భర్త ఎన్టీఆర్ బతికున్న రోజుల్లో చంద్రబాబునాయుడుపై ఆయన ఏం వ్యాఖ్యలు చేశారో వాటి గురించి ఆమె ప్రస్తావించారు.

మళ్లీ తాను అధికారంలోకి వస్తే చంద్రబాబును అండమాన్ జైలుకు పంపించాలని ఉందని తనతో అనేవారని గుర్తుచేసుకున్నారు. చంద్రబాబుకు ఆ రోజు త్వరలోనే వస్తుందని ఆశిస్తున్నానని వ్యాఖ్యానించారు. ఏపీలో టీడీపీ గత పాలనపై విచారణ నిమిత్తం ఏర్పాటు చేసిన సిట్ ద్వారా అన్ని వాస్తవాలు బయటకొస్తాయని ఆశిస్తున్నానని అన్నారు. చంద్రబాబు, అచ్చెన్నాయుడు, సుజనా చౌదరి.. ఈ ముగ్గురూ జైలుకు వెళ్లడం చూడాలని ఉందని చెప్పారు.  

తెలుగు భాషాభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నాం

ప్రాచీన తెలుగు భాషకు పూర్వ వైభవం తీసుకొస్తామని లక్ష్మీపార్వతి చెప్పారు. తెలుగు సాహిత్య పీఠాన్ని విశ్వవిద్యాలయంగా అభివృద్ధి చేస్తామని అన్నారు. తెలుగు అకాడమీ ద్వారా ‘తెలుగు’ భాషాభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పిన లక్ష్మీపార్వతి, ‘తెలుగు’తో పాటు ’ఇంగ్లీషు‘కు కూడా సీఎం జగన్ ప్రాధాన్యమిస్తున్నారని అన్నారు.

Lakshmi Parvati
YSRCP
Chandrababu
Telugudesam
NTR
  • Loading...

More Telugu News