KTR: సారీ బ్రదర్... ఇలాంటివి నాకిష్టం ఉండదు: కేటీఆర్

KTR anger over Fan who tattoos on his back

  • వీపుపై కేటీఆర్ బొమ్మ పచ్చబొట్టు పొడిపించుకున్న అభిమాని
  • అసహనం వ్యక్తం చేసిన కేటీఆర్
  • ఇలాంటి చర్యలను తాను ప్రోత్సహించనని స్పష్టీకరణ

ఓ వీరాభిమాని వీపుపై తన చిత్రాన్ని పచ్చబొట్టు పొడిపించుకోవడం పట్ల తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ఇది నిజమే అయితే ఇలాంటివి తాను అస్సలు ఇష్టపడనని స్పష్టం చేశారు. సారీ బ్రదర్, ఇలాంటి వాటిని నేను ప్రోత్సహించను అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఏదేమైనా ఇటువంటి చర్య అనారోగ్యకరమని, కలవరపాటుకు గురిచేస్తోందని వ్యాఖ్యానించారు. రవికిరణ్ అనే అభిమాని వీపుపై పచ్చబొట్టు పొడిపించుకున్న ఫొటోను ట్విట్టర్ లో పోస్టు చేయగా కేటీఆర్ పైవిధంగా వ్యాఖ్యానించారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News