Sabarmati Ashram: ట్రంప్, మెలానియా సబర్మతి ఆశ్రమంలో ఏమీ తినలేదు: ఆశ్రమ ట్రస్టీ

Sabarmati Ashram trustee says Trump did not eat anything at ashram

  • సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించిన ట్రంప్
  • ట్రంప్ కోసం అనేక వంటకాలు సిద్ధం చేసిన ఆశ్రమ వర్గాలు
  • ఆశ్రమం నుంచి నేరుగా మొతేరా స్టేడియానికి వెళ్లిన ట్రంప్

భారత పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదటగా గుజరాత్ లోని సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించారు. తన భార్య మెలానియాతో కలిసి ఆశ్రమానికి విచ్చేసిన ఆయన అక్కడ మహాత్మాగాంధీ స్మారక చిహ్నాలను పరిశీలించారు. అయితే, ట్రంప్, ఆయన బృందం కోసం ఆశ్రమ వర్గాలు అనేక సంప్రదాయక వంటకాలను సిద్ధం చేశారు.

గుజరాతీ ఫేమస్ ఖమాన్, బ్రోకోలి కార్న్ సమోసా, ఆపిల్ పై, కాజు కత్లి, అనేక రకాలు టీలు తయారు చేశారు. అయితే, ఆ వంటకాలను ట్రంప్ కానీ, ఆయన భార్య మెలానియా కానీ ఎవరూ స్వీకరించలేదని సబర్మతి ఆశ్రమ ట్రస్టీ కార్తికేయ సారాభాయ్ వెల్లడించారు. సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించిన వెంటనే ట్రంప్ తదితరులు నమస్తే ట్రంప్ కార్యక్రమం కోసం మొతేరా స్టేడియానికి తరలి వెళ్లారు.

Sabarmati Ashram
Donald Trump
Melania Trump
Eataries
India
USA
  • Loading...

More Telugu News