CAA: ఢిల్లీలో సీఏఏపై నిరసనల్లో చెలరేగిన హింస ..హెడ్​ కానిస్టేబుల్​ మృతి !

  • జఫ్రాబాద్, గోకుల్ పురిలో రెండు వర్గాల మధ్య  ఘర్షణ
  • పరస్పరం రాళ్లు రువ్వుకున్న ఇరువర్గాలు
  • డీసీపీ అమిత్ శర్మకు గాయాలు

ఢిల్లీలో సీఏఏను వ్యతిరేకిస్తూ చేపట్టిన నిరసనలు హింసాత్మక ఘటనలకు దారితీశాయి. ఢిల్లీలోని జఫ్రాబాద్, గోకుల్ పురిలో రెండు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఇరువర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నాయి. ఈ ఘర్షణలో  ఓ హెడ్ కానిస్టేబుల్ తలకు రాయి తగలడంతో మృతి చెందాడు. మృతి చెందిన కానిస్టేబుల్ పేరు రతన్ లాల్ అని సమాచారం. డీసీపీ అమిత్ శర్మకు గాయాలు కావడంతో సమీప ఆసుపత్రికి తరలించారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈశాన్య ఢిల్లీలో 144 సెక్షన్ విధిస్తున్నట్టు పోలీస్ అధికారులు ప్రకటించారు. కాగా, ఈ ఘటనపై సీఎం కేజ్రీవాల్ స్పందించారు. శాంతి భద్రతలు పరిరక్షించాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.

CAA
Protest
New Delhi
Jafrabad
Gokulpuri
Stone pelt
  • Loading...

More Telugu News