Janasena: జనసేన సంయుక్త పార్లమెంటరీ కమిటీల నియామకం

Janasena announces Joint Parliamentary Committees

  • పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకుంటున్న జనసేన హైకమాండ్
  • రాష్ట్రంలో 5 సంయుక్త పార్లమెంటరీ కమిటీలు
  • హరిప్రసాద్ పేరిట ప్రకటన

మరికొన్ని రోజుల్లో ఏపీలో పంచాయతీ ఎన్నికలు జరుగుతాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో జనసేన పార్టీ క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుంటోంది. తాజాగా, జనసేన సంయుక్త పార్లమెంటరీ కమిటీలను ప్రకటించారు. ఏపీలో 25 లోక్ సభ స్థానాలు ఉండగా, 5 సంయుక్త పార్లమెంటరీ కమిటీలను నియమించారు. ఉత్తరాంధ్ర సంయుక్త కమిటీ, గోదావరి సంయుక్త కమిటీ, సెంట్రల్ ఆంధ్ర సంయుక్త కమిటీ, రాయల దక్షిణ కోస్తా సంయుక్త కమిటీ, రాయలసీమ సంయుక్త కమిటీలను ఏర్పాటు చేసినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు జనసేనాని పవన్ కల్యాణ్ రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ నుంచి ఓ ప్రకటన వెలువడింది.

Janasena
Joint Parliamentary Committee
Andhra Pradesh
Parliament
  • Error fetching data: Network response was not ok

More Telugu News