Ivanka Trump: "కళ్లు చెదిరిపోయాయి".... నమస్తే ట్రంప్ కార్యక్రమంపై ఇవాంకా స్పందన

Ivanka Trump lauds Namaste Trump a spectacular

  • భారత పర్యటనకు కుటుంబంతో కలిసి విచ్చేసిన ట్రంప్
  • మొతేరా స్టేడియంలో ఇసుకేస్తే రాలనంత జనాన్ని ఉద్దేశించి ట్రంప్ ప్రసంగం
  • నమస్తే ట్రంప్ కార్యక్రమం చూసి సంతోషంతో పొంగిపోయిన ఇవాంకా

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో పాటు ఆయన కుటుంబసభ్యులు కూడా భారత్ పర్యటనకు విచ్చేశారు. భార్య మెలానియా, కుమార్తె ఇవాంకా, అల్లుడు జారెడ్ కుష్నర్ తదితరులు ట్రంప్ వెంట పర్యటిస్తున్నారు. ఈ మధ్యాహ్నం అహ్మదాబాద్ లోని ప్రపంచ అతిపెద్ద క్రికెట్ స్టేడియం మొతేరాలో నిర్వహించిన నమస్తే ట్రంప్ కార్యక్రమాన్ని ట్రంప్ తనయ ఇవాంకా ట్రంప్ కూడా వీక్షించారు.

తన తండ్రి మాట్లాడుతుండగా ప్రజల నుంచి వస్తున్న విశేష స్పందన చూసి ఆమె సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమం అనంతరం మీడియా ప్రతినిధులు ఆమె స్పందన కోరారు. దాంతో ఇవాంకా "స్పెక్టాక్యులర్" అంటూ ఒకే ఒక్క పదంతో తన అనుభూతిని వ్యక్తం చేశారు. 'కళ్లు చెదిరిపోయాయి' అనే అర్థం వచ్చేలా ఆమె చెప్పిన జవాబు ట్రంప్ కు భారత గడ్డపై లభిస్తున్న ఆదరణను చాటుతోంది.

Ivanka Trump
Donald Trump
India
Motera Stadium
Namaste Trump
  • Loading...

More Telugu News