ganguly: త్వరలో సౌరవ్ గంగూలీ బయోపిక్?

sourav ganguly biopic to be made soon

  • తెరకెక్కించనున్న కరణ్ జొహార్!
  • దాదాతో పలుమార్లు సంప్రదింపులు
  • హీరోను వెతికే పనిలో ఉన్న కరణ్, గంగూలీ

బాలీవుడ్ లో మరో స్పోర్ట్స్ బయోపిక్  తెరకెక్కనుంది. భాగ్ మిల్కా భాగ్, మేరీకోమ్ సూపర్ హిట్ అయిన తర్వాత బాలీవుడ్ లో క్రీడాకారుల జీవిత చరిత్రపై సినిమాల పరంపర కొనసాగుతోంది. ఎమ్ ఎస్ ధోనీ, సచిన్ ఎ బిలియన్ డ్రీమ్స్ కూడా విడుదలై హిట్టు కొట్టగా.. 1983 వరల్డ్ కప్ గెలిచిన కపిల్ దేవ్ జట్టుపై రణ్ వీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఓ  సినిమా తెరకెక్కుతోంది. తాజాగా ఈ జాబితాలో భారత మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ పేరు చేరనుంది. దాదా జీవిత చరిత్ర ఆధారంగా ప్రముఖ దర్శకుడు కరణ్ జొహార్ సినిమా తీసే పనిలో ఉన్నారట.  

తన బయోపిక్ తీస్తామని చాలా మంది తనను కలిశారని దాదా గతంలో పలుసార్లు ప్రకటించాడు. అయితే, దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నాడు. వెండితెరపై తన పాత్రను హృతిక్ రోషన్ పోషిస్తే బాగుంటుందని కూడా గంగూలీ ఓ సందర్భంలో చెప్పాడు. అయితే, దాదా బయోపిక్ ను తీసే బాధ్యత కరణ్ జొహార్ తీసుకున్నాడని తాజా సమాచారం. దీనికోసం ఇద్దరూ ఇప్పటికే రెండు మూడు సార్లు సమావేశం అయ్యారని, ప్రస్తుతం దాదా పాత్రలో నటించే హీరో కోసం అన్వేషిస్తున్నారని తెలుస్తోంది. అయితే, ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన రావాలంటే మరికొంత సమయం వేచి చూడాల్సి ఉంది.

గతంలో ఏక్తా కపూర్ ప్రయత్నం: 
దాదా జీవిత చరిత్ర ఆధారంగా సినిమా తీయాలని ఇంతకుముందు ఏక్తా కపూర్ కూడా ప్రయత్నించారు. ఈ విషయాన్ని గంగూలీనే వెల్లడించాడు. సినిమా గురించి ఏక్తా తనను ఒకసారి కలిశారని చెప్పాడు. కానీ, అంతకుమించి ఏమీ జరగలేదన్నాడు. ఎమ్ ఎస్ ధోనీ బయోపిక్ తనకు బాగా నచ్చిందని,  సచిన్ ఎ బిలియన్ డ్రీమ్స్ ఓ ప్రత్యేకమైన సినిమా అని దాదా అన్నాడు. అలాగే, 1983 వరల్డ్ కప్ గెలిచిన జట్టుపై తీస్తున్న సినిమాను కూడా తప్పకుండా చూస్తానని చెప్పాడు.

ganguly
Karan Johar
biopic
Bollywood
bcci
Cricket
ekta kapoor
  • Loading...

More Telugu News