RGV: మోదీ కోసం అమెరికా వాళ్లు ఇంత భారీగా ఖర్చు చేయగలరా?: వర్మ

Ram Gopal Varma reacts on Trump visit

  • భారత్ పర్యటనకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్
  • అహ్మదాబాద్ లో కళ్లు చెదిరే స్వాగతం
  • అమెరికాకు భారత్ కు మధ్య తేడా ఇదేనంటున్న వర్మ

విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ రాకపై స్పందించారు. "డొనాల్డ్ ట్రంప్ కు స్వాగతం పలికేందుకు మనం వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. మరి నరేంద్ర మోదీకి స్వాగతం పలికేందుకు అమెరికా వాళ్లు కనీసం వేల రూపాయలైనా ఖర్చు పెడతారా? ఇది భారత్ ను ప్రశ్నించడం కాదు, అమెరికా గురించి చెబుతున్నానంతే!" అంటూ వర్మ ట్విట్టర్ లో వ్యాఖ్యానించారు. రెండ్రోజుల పర్యటన కోసం భారత్ వచ్చిన ట్రంప్ కు అట్టహాసంగా స్వాగతం పలికిన సంగతి తెలిసిందే. ట్రంప్ కాలుమోపిన అహ్మదాబాద్ నగరం జనసంద్రాన్ని తలపిస్తోంది.

RGV
Donald Trump
Narendra Modi
India
USA
  • Loading...

More Telugu News