Donald Trump: రోడ్లకిరువైపులా జనాన్ని చూసి విస్మయానికి గురైన ట్రంప్ సహాయకుడు!

Trump assistant comments on Indian people

  • అహ్మదాబాద్ లో ట్రంప్ కు అపురూప స్వాగతం
  • రోడ్లకిరువైపులా లక్షల మంది జనం
  • వావ్ అంటూ సంభ్రమాశ్చర్యాలకు గురైన ట్రంప్ అసిస్టెంట్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండ్రోజుల పర్యటన నిమిత్తం భారత్ లో కాలుమోపారు. అహ్మదాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ట్రంప్ కు అత్యంత ఘనమైన స్వాగతం లభించింది. అనంతరం ఆయన కాన్వాయ్ ప్రయాణిస్తుండగా రోడ్డుకిరువైపులా లక్షల మంది నిల్చుని ట్రంప్ కు ఆహ్వాన వచనాలు పలుకుతూ కనిపించారు.

 ఈ దృశ్యాన్ని చూసి ట్రంప్ సహాయకుడు డాన్ స్కావినో జూనియర్ విస్మయానికి గురయ్యారు. 'వావ్' అంటూ సంభ్రమాశ్చర్యాలు వ్యక్తం చేశారు. 'నమస్తే ట్రంప్' కు ఇంతటి విశేషాదరణా! అంటూ ట్వీట్ చేశారు. వాస్తవానికి ట్రంప్ కొన్నిరోజులుగా తనకు భారత్ లో నమ్మశక్యం కాని రీతిలో స్వాగతం లభిస్తుందని అంచనాలు వేయడమే కాదు, దీనిపై ప్రకటనలు కూడా చేశారు. ఇప్పుడాయన అంచనాలకు మించడంతో సహాయక బృందం కూడా సంతోషం పట్టలేకపోతోంది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News